ntr: 'జై లవ కుశ'లో 'రౌడీ అల్లుడు' పోలికలు?


'జై లవ కుశ' సినిమా నుంచి ఇటీవల ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ఒక సీన్ చూసినవాళ్లు .. 'రౌడీ అల్లుడు' సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని గురించి నెట్టింట్లో నానా రచ్చ జరిగిపోతోంది. 'రౌడీ అల్లుడు' సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్ర రఫ్ గా పెరిగిన ఆటో జానీ అయితే .. కల్యాణ్ గా మరో పాత్రలో ఒక సంస్థను నిర్వహిస్తుంటాడు.

ఒక సందర్భంలో కల్యాణ్ లుక్ తో ఆయన ప్లేస్ లోకి వచ్చిన ఆటోజాని, ఆఫీసులో చిత్ర విచిత్రంగా ప్రవర్తించి అక్కడి వాళ్లకి షాకిస్తాడు. ఇక 'జై లవ కుశ'లో బుద్ధిమంతుడైన 'లవ' లుక్ తో ఆయన ఆఫీసులోకి మాస్ క్యారెక్టర్ అయిన 'కుశ' ఎంట్రీ ఇచ్చి అక్కడ నానా అల్లరి చేస్తాడు. 'లవ'లో వచ్చిన మార్పు అనుకుని స్టాఫ్ అంతా నోరెళ్ల బెడతారు. ఇలా 'రౌడీ అల్లుడు' సీన్ ను పోలిన సీన్ 'జై లవ కుశ'లో ఉండటం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.    

ntr
  • Loading...

More Telugu News