keerti suresh: లేటెస్ట్ స్టిల్ పై కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చేసింది!


తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ కీర్తి సురేశ్ దూసుకుపోతోంది. ఆమె లేటెస్ట్ స్టిల్ ఒకటి నిన్నంతా సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. ఈ స్టిల్ లో కీర్తి సురేశ్ పూర్తి డిఫరెంట్ గా కనిపిస్తోంది. దాంతో అంతా అది 'మహానటి' సినిమాలో 'సావిత్రి'కి సంబంధించిన లుక్ అని భావించారు. అదే న్యూస్ నిన్నంతా హల్ చల్ చేసింది.

 తాజాగా ఈ విషయం పై కీర్తి సురేశ్ స్పందించింది. తన లేటెస్ట్  స్టిల్ కు .. ' మహానటి' సినిమాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని అంది. రీసెంట్ గా తాను ఓ యాడ్ చేశాననీ .. ఆ లుక్  దానికి సంబంధించినదని స్పష్టం చేసింది. కీర్తి సురేశ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడినట్టే. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లోని మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News