ntr: ప్రణతి భయపడేంతగా 'రావణ' పాత్రలో ఎన్టీఆర్ ఇన్వాల్వ్ అయ్యాడు: కల్యాణ్ రామ్


'జై లవ కుశ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ సినిమా గురించి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో మూడు పాత్రలను పోషించగా .. ముందుగా 'రావణ' పాత్రను చిత్రీకరించామని అన్నాడు. ఆ పాత్ర నత్తిగా మాట్లాడుతూ చిత్రంగా ప్రవర్తిస్తుందని చెప్పాడు. ఆ క్యారెక్టర్ లో నటించిన ఎన్టీఆర్ .. ఆ పాత్రలో నుంచి బయటికి రావడానికి సమయం పట్టేదని అన్నాడు.

ఒక రోజు ఎన్టీఆర్ తెల్లవారు జామున 3 గంటలకు నిద్రలో లేచి నత్తిగా మాట్లాడుతూ నడచుకుంటూ వెళ్లి కిటికీలో నుంచి రెండు కాళ్లను బయటికి పెట్టాడని చెప్పాడు. కిటికీ గ్లాస్ పగిలి చిన్న గ్లాస్ పీస్ కాలికి గుచ్చుకున్న విషయం కూడా ఆయనకి తెలియలేదని అన్నాడు. మర్నాడు ఉదయం ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేసిందనీ, అంతగా ఆయన ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.  

ntr
rasi khanna
  • Loading...

More Telugu News