akash puri: తనయుడి కోసం పూరీ ఎంచుకున్నది మామూలు ప్రేమకథ కాదట!


తన నెక్స్ట్ మూవీ తన తనయుడితోనే ఉంటుందని ఇటీవలే దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పష్టం చేశాడు. పూరీ తనయుడు ఆకాశ్ గతంలో 'ఆంధ్రాపోరి' అనే సినిమా చేశాడు. ఆ తరువాత తన తనయుడికి నటన .. డాన్స్ .. ఫైట్స్ వంటి వాటిలో శిక్షణ ఇప్పించడానికి పూరీ అతనిని ఫారిన్ పంపించాడు. ఆ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన ఆకాశ్, తండ్రి దర్శకత్వంలో హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.

టీనేజ్ కుర్రాడు కనుక అతనితో లవ్ స్టోరీనే పూరీ ప్లాన్ చేస్తాడని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అయితే తనయుడి కోసం పూరీ ప్లాన్ చేసింది ఆషామాషీ లవ్ స్టోరీ కాదని సమాచారం. ఇండియన్ కుర్రాడికి, పాకిస్థాని అమ్మాయికి మధ్య గల ప్రేమ ఈ సినిమా కథా వస్తువు అని తెలుస్తోంది. ప్రస్తుతం పూరీ కొత్త కథానాయికను వెతికే పనిలో వున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.     

akash puri
  • Loading...

More Telugu News