lavanya tripathi: పారితోషికం పెంచడం వల్లనే లావణ్య త్రిపాఠిని తప్పించారట!


లావణ్య త్రిపాఠి కెరియర్లో సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా కనిపిస్తుంది. సీనియర్ హీరో నాగార్జున సరసన 'సోగ్గాడే చిన్నినాయనా' చేసి మెప్పించడం .. యంగ్ హీరో నానితో 'భలే భలే మగాడివోయ్' చేసి అలరించడం ఆమెకే సాధ్యమైంది. తాజాగా తెలుగులో ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకి ముస్తాబవుతున్నాయి. అలాంటి లావణ్య .. విజయ్ దేవరకొండ సినిమాలో కథానాయికగా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి లావణ్య తప్పుకున్నట్టు .. ఆమె స్థానంలోకి రష్మిక మందనను తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి తప్పుకోలేదనీ .. భారీ స్థాయిలో పారితోషికం పెంచడం వలన తప్పించారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో తాను నటిస్తున్నట్టుగా రష్మిక మందన ట్వీట్ చేయడంతో, ఆమె విషయంలోను క్లారిటీ వచ్చేసింది.     

lavanya tripathi
rashmika mandana
  • Loading...

More Telugu News