raviteja: షూటింగ్ ముగింపు దిశగా 'రాజా ది గ్రేట్'


కొంత గ్యాప్ తరువాత రవితేజ చేస్తోన్న సినిమా కావడంతో, 'రాజా ది గ్రేట్' పై ఆయన అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది. ఈ నెల 15వ తేదీతో చివరి షెడ్యూల్ పూర్తవుతుంది. ఆ తరువాత మిగతా పనులను పూర్తి చేసి అక్టోబర్ 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

రవితేజ చూపులేని వ్యక్తిగా నటిస్తోన్న ఈ సినిమాలో, మెహ్రీన్ కథానాయికగా అలరించనుంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రవితేజ వున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి 'పటాస్'.. 'సుప్రీమ్' హిట్స్ ఇచ్చి ఉండటం వలన, ఈ సినిమాపై రవితేజ మరింత నమ్మకంతో వున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా, రవితేజ నమ్మకాన్ని నిలబెడుతుందేమో చూడాలి.     

  • Loading...

More Telugu News