nikhil: లిఫ్ట్ లో చిక్కుకున్న నిఖిల్ .. ఆందోళన చెందిన ఫ్యాన్స్


వ్యాపార సంస్థలు పబ్లిసిటీ కోసం సినిమా వాళ్ల చేత ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరిపిస్తూ వుంటారు. ఇందుకోసం క్రేజ్ వున్న హీరో హీరోయిన్లను ఆహ్వానిస్తుంటారు. అలా గుంటూరులోని ఒక జిమ్ ను ప్రారంభించడానికి హైదరాబాద్ నుంచి నిఖిల్ వెళ్లాడు. అక్కడి భవనం పై అంతస్తులోకి వెళ్లడానికి ఆయన లిఫ్ట్ ను ఉపయోగించాడు.

 అయితే మధ్యలోకి వెళ్లగానే లిఫ్ట్ ఆగిపోయింది. దాని డోర్స్ తెరవడం సిబ్బంది వల్లకాకపోవడంతో, అప్పటికే అక్కడికి చేరుకున్న నిఖిల్ అభిమానులు టెన్షన్ పడ్డారు. ఒక పట్టాన ఆ లిఫ్ట్ డోర్స్ తెరుచుకోకపోవడంతో, పోలీసులు రంగంలోకి దిగవలసి వచ్చింది. కొంతసేపు శ్రమించి వాళ్లు లిఫ్ట్ డోర్స్ ను పగలగొట్టడంతో నిఖిల్ బయటికి వచ్చాడు. ఈ సంఘటన పట్ల నిఖిల్ కాస్త అసహనానికి లోనైనట్టు సమాచారం.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News