charan: అందరినీ ఆశీర్వదించమంటూ మట్టి గణేషుడితో చరణ్ - ఉపాసన


పర్యావరణ పరిరక్షణకి సంబంధించిన విషయాలను ప్రచారం చేయడంలో చరణ్ .. ఉపాసన ఎప్పుడూ ముందే వుంటారు. కలర్స్ తోను .. కెమికల్స్ తోను తయారు చేసిన వినాయక విగ్రహాలను కాకుండా, మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పూజించమని చెప్పారు. తమ ఫ్యామిలీ కూడా మట్టితో చేసిన వినాయక మూర్తిని పూజించడం జరిగిందంటూ అందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

 ఇక మట్టి వినాయక ప్రతిమను నిమజ్జనానికి తరలిస్తూ, చరణ్ .. ఉపాసన ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరికీ వినాయకుడి ఆశీస్సులు లభించాలనీ, అందరి కోరికలు నెరవేరాలని చరణ్ .. ఉపాసన దంపతులు ఆకాంక్షించారు. అంతా మంచి ఆలోచనలతో .. నిర్ణయాలతో సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించాలని కోరుకున్నారు.    

charan
upasana
  • Loading...

More Telugu News