vijaydevarakonda: నేచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ!


ఇప్పుడు యూత్ అభిమానించే క్రేజీ స్టార్స్ లో ఒకరుగా విజయ్ దేవరకొండ మారిపోయాడు. యూత్ లో ఆయనను అభిమానించే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో 'అర్జున్ రెడ్డి' తరువాత రానున్న ఆయన సినిమా ఏమిటనే విషయంపై అభిమానులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ లో విజయ్ దేవరకొండ చేస్తోన్న సినిమాయే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

 రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా .. ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది. నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతోందనీ .. డిఫరెంట్ లుక్ తో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని అంటున్నారు. త్వరలోనే ఫస్టు లుక్ ను .. టీజర్ ను రిలీజ్ చేసి, సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.     

  • Error fetching data: Network response was not ok

More Telugu News