kalyan krishna: మూడో హిట్ కోసం కల్యాణ్ కృష్ణ గట్టిగానే ట్రై చేస్తున్నాడట!


దర్శకుడు కల్యాణ్ కృష్ణ తన తొలి సినిమానే నాగార్జునతో చేశారు. 'సోగ్గాడే చిన్ని నాయనా' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, నాగ్ కెరియర్లోనే భారీ వసూళ్లను సాధించింది. దాంతో చైతూ సినిమాను కల్యాణ్ కృష్ణ చేతిలో పెట్టాడు నాగ్. 'రారండోయ్ వేడుక చూద్దాం' పేరుతో వచ్చిన ఈ సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంది.

ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నా, కల్యాణ్ కృష్ణకి పెద్దగా అవకాశాలు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ రెండు సినిమాల సక్సెస్ లో నాగార్జున పాత్ర ఎక్కువనే టాక్ ఎక్కువగా ప్రచారం కావడమే ఇందుకు కారణమని అంటున్నారు. అందువలన మూడో సినిమాను బయటివారికి చేసి హిట్ కొట్టాలని, అలా తన సత్తాను చాటుకోవాలని పట్టుదలతో కల్యాణ్ కృష్ణ వున్నాడని చెబుతున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి మరి.    

kalyan krishna
  • Loading...

More Telugu News