మేఘా ఆకాశ్ కి కలిసి రాలేదంతే!
అదే సమయంలో ఆమెకి నితిన్ సినిమా 'లై'లో అవకాశం వచ్చింది. దాంతో ఆమె రామ్ సినిమాకి నో చెప్పేసి .. నితిన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపించారు. అయితే 'లై' సినిమా ప్లాప్ కావడంతో, వాళ్లంతా కూడా వెనక్కి తగ్గినట్టుగా సమాచారం. 'లై' సినిమాతో కలిసి రాకపోవడంతో, నెక్స్ట్ సినిమాపైనే మేఘా ఆకాశ్ ఆశలు పెట్టుకుందట.