mahesh babu: మహేశ్ కోసం 2 కోట్లతో అసెంబ్లీ భవనం సెట్!
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'భరత్ అను నేను' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. అందువలన సహజంగానే అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించవలసి ఉంటుంది. ఈ కారణంగా హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో అసెంబ్లీ భవనం సెట్ వేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ సెట్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టుగా వినికిడి. త్వరలోనే ఈ సెట్లో షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. 30 నుంచి 40 రోజుల పాటు ఈ సెట్లో షూటింగ్ జరగనుందని చెబుతున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో కొరటాల వున్నారు. ఈ కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' బ్లాక్ బస్టర్ కావడం వలన, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.