vijay sethupathi: 'సైరా'లో విజయ్ సేతుపతి ఎంపిక ప్రత్యేకమే!


చిరంజీవి తాజా చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' పేరుతో తెరకెక్కనుంది. ఈ సినిమాలో అమితాబ్ .. కన్నడ స్టార్ సుదీప్ నటించనున్నట్టు, కథానాయికగా నయనతారను తీసుకోనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. అందువలన నటీనటుల జాబితాలో వున్న వాళ్ల పేర్లు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఇక హఠాత్తుగా ఈ జాబితాలోకి వచ్చి చేరిన పేరు విజయ్ సేతుపతి.

తమిళంలో చిన్న చిన్న పాత్రలతో కెరియర్ ను మొదలు పెట్టిన విజయ్ సేతుపతి, ఆ తరువాత స్టార్ హీరోగా ఎదిగాడు. సహజమైన నటనతో ఆడియన్స్ కి కనెక్ట్ కావడం ఆయన ప్రత్యేకత. అగ్రకథానాయికలు సైతం ఆయనతో కలిసి నటించడానికి ఆసక్తిని చూపుతారంటే, అక్కడ ఆయనకి గల క్రేజ్ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి విజయ్ సేతుపతిని, చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న సినిమా కోసం ఎంపిక చేయడం విశేషమేనని చెప్పాలి. విజయ్ సేతుపతి పోషించనున్న పాత్ర ఏమిటనేది త్వరలోనే తెలిసే అవకాశం వుంది.  

vijay sethupathi
  • Loading...

More Telugu News