balakeishna: బాలకృష్ణ మూవీలో పిల్లాడి తల్లి పాత్రలో నయనతార?


నయనతార చాలా ధైర్యవంతురాలని ఆమె తోటి కథానాయికలు చెబుతుంటారు. ఎందుకంటే వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకోవడంలో ఆమె ఎంతమాత్రం తడబాటుకు లోనుకాదు. అలా ధైర్యంతో ఆమె తీసుకున్న నిర్ణయాలే ఈ రోజున ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అలాంటి నయనతార ప్రస్తుతం బాలకృష్ణ 102వ సినిమాలో నటిస్తోంది.

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగులో ఆమె నిన్ననే జాయిన్ అయింది. నయనతార .. ఓ చిన్న కుర్రాడు .. ఆ ఇంటి పెద్దాయనకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో తెరకెక్కిస్తున్నారు. దీనిని బట్టి 'తులసి' సినిమాలో మాదిరిగా ఓ కుర్రాడికి తల్లి పాత్రలో ఆమె కనిపించనుందా? అనే సందేహం తలెత్తుతోంది. బాలకృష్ణ - నయనతార హిట్ పెయిర్ అనే సంగతి తెలిసిందే. ఆల్రెడీ రెండు హిట్స్ అందుకున్న ఈ జంట, హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో చూడాలనే ఆసక్తిని అభిమానులు కనబరుస్తున్నారు . 

  • Loading...

More Telugu News