chiranjeevi: మొత్తానికి 'సైరా నరసింహా రెడ్డి'లో నయనతారనే ఫిక్స్ చేశారు!


చిరంజీవి 151వ సినిమా టైటిల్ ను 'సైరా నరసింహా రెడ్డి' గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార పేరును ప్రకటించారు. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన ఉండటం వలన, బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవడానికే చాలావరకూ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో చాలామంది కథానాయికల పేర్లు వినిపించాయి. అలాగే నయనతార పేరు కూడా వినిపించింది.

తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అందువలన ఆమెను తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. బహు భాషా చిత్రం కావడం వలన భారీగా పారితోషికం డిమాండ్ చేస్తోందనే టాక్ వచ్చింది. దాంతో అభిమానులు మళ్లీ సందిగ్ధంలో పడ్డారు. ఈ రోజున ఈ సినిమా టైటిల్ తో పాటు హీరోయిన్ గా నయనతార పేరు బయటికి రావడంతో, ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అదృష్టమంటే నయనతారదేనని అనేస్తున్నారు. 

chiranjeevi
nayan
  • Loading...

More Telugu News