dil raju: 'ఫిదా' హిందీ రీమేక్ తో బాలీవుడ్ కి దిల్ రాజు?


తెలంగాణ అమ్మాయి ప్రేమకథగా తెరకెక్కిన 'ఫిదా' సినిమా .. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బయ్యర్లకి లాభాల పంట పండిస్తోంది. అలాంటి ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పంజాబీ అమ్మాయి ప్రేమకథ నేపథ్యంగా అక్కడ ఈ సినిమాను తెరకెక్కిస్తారట. బాలీవుడ్ లో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ ను ఈ సినిమా కోసం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

 దిల్ రాజు ఇకపై హిందీ సినిమాలను కూడా నిర్మించనున్నట్టు కొన్ని రోజులుగా ఒక టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'ఫిదా' సినిమా రీమేక్ తో ఆయన బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం వుంది.     

  • Loading...

More Telugu News