aravind swami: హిట్ మూవీ రీమేక్ లో అరవింద్ స్వామి సరసన నికీషా పటేల్!


రొమాంటిక్ హీరోగా మంచి మార్కులు కొట్టేసిన అరవింద్ స్వామి, కొంత గ్యాప్ తరువాత తన వయసుకి తగిన పాత్రలను చేస్తూ వస్తున్నారు. కీలకమైన పాత్రలు .. స్టైలీష్ విలన్ పాత్రలతో పాటు, కథానాయకుడిగా కూడా ఆయన ప్రేక్షకుల ముందుకు కొత్తగా వస్తున్నారు. అలాంటి అరవింద్ స్వామి తమిళంలో ఒక సినిమా చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'భాస్కర్ ది రాస్కెల్' మూవీకి ఇది రీమేక్.

మలయాళంలో మమ్ముట్టి - నయనతార చేయగా, తమిళంలో అరవింద్ స్వామి సరసన అమలా పాల్ .. నికిషా పటేల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నికీషా పటేల్ స్వయంగా తెలియజేసింది. ఈ సినిమా షూటింగులో కొన్ని రోజులు పాల్గొన్నట్టుగా కూడా ట్విట్టర్ ద్వారా చెప్పింది. అరవింద్ స్వామి సరసన నటించే అవకాశం రావడాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని ఆనందాన్ని వ్యక్తం చేసింది. 

aravind swami
amala paul
nikesha
  • Loading...

More Telugu News