Rana: ప్రియా బెనర్జీకి లక్కీ ఛాన్స్!


ఆమధ్య నారా రోహిత్ సరసన 'అసుర' సినిమాలో నటించిన ప్రియా బెనర్జీ గుర్తుందిగా? ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈ బెంగాలీ సుందరికి టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో ప్రియ తాజాగా రానా దగ్గుబాటి సరసన నటించే ఛాన్స్ పొందింది. అయితే, ఇది సినిమా కాదు.. వెబ్ సీరీస్! 'సోషల్' పేరుతో రానా తాజాగా వెబ్ సీరీస్ లో నటించడానికి అంగీకరించిన సంగతి విదితమే. తెలుగు, హిందీ భాషల్లో రూపొందే ఈ సీరీస్ లో రానా పక్కన ప్రియా బెనర్జీని కథానాయికగా ఎంచుకున్నారు. ఈ విషయం గురించి ప్రియ చెబుతూ, 'ఇందులో ఓ నటిగా నటిస్తున్నాను. అనుకోకుండా ఒకసారి ఇంటర్నెట్ కు సంబంధించిన ఓ సమస్య ఆమెకు ఎదురవుతుంది. దాని నుంచి ఎలా బయటపడింది? అనేది ఆసక్తికరంగా సాగుతుంది' అని చెప్పింది.శశి దర్శకత్వంలో ఈ వెబ్ సీరీస్ రూపొందుతున్నాయి.   

  • Loading...

More Telugu News