akhil: అఖిల్ మూవీ టైటిల్ 'హలో'తోనే మొదలవుతుందా?


విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండవ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకూ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ బయటికి వచ్చింది. ఒక వైపున విలన్ గ్యాంగ్ ను ఉతికి ఆరేస్తూనే .. మరో వైపున హీరోయిన్ తో కూల్ గా రొమాన్స్ చేస్తోన్న అఖిల్ లుక్ యూత్ కి తెగ నచ్చేసింది. అయితే ఈ సినిమా టైటిల్ ఏమిటనేది మాత్రం రివీల్ చేయలేదు.

 తాను .. అమల నటించిన 'నిర్ణయం' సినిమాలోని 'హాలోగురూ ప్రేమకోసమేనోయ్ జీవితం' అనే పాట వాక్యంలోనే అఖిల్ మూవీ టైటిల్ ఉంటుందంటూ నాగ్ సస్పెన్స్ లో పెట్టేశాడు. దాంతో ఈ సినిమా టైటిల్ 'హలో గురూ' కావొచ్చని కొందరు .. 'ప్రేమకోసమేనోయ్ జీవితం' కావొచ్చని మరికొందరు ఊహించుకుంటున్నారు. ఇక 'హలో' అనే టైటిల్ ను ఈ సినిమా కోసం రిజిస్టర్ చేయించారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 

  • Loading...

More Telugu News