Sai Pallavi: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం


*  ఇటీవల విడుదలైన 'ఫిదా' చిత్రంతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న కథానాయిక సాయిపల్లవి త్వరలో ఓ హారర్ థ్రిల్లర్ లో నటించనుంది. ఆ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఆ సినిమా చేయడానికి ఈ చిన్నది ఓకే చెప్పిందట. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
*  ప్రస్తుతం మంచు మనోజ్ చేస్తున్న 'ఒక్కడు మిగిలాడు' చిత్రాన్ని తమిళంలోకి కూడా డబ్ చేస్తున్నారు. 'కబాలి' సినిమాలోని రజనీకాంత్ డైలాగైన 'నాన్ తిరింబ వరువేన్'ను దీనికి టైటిల్ గా నిర్ణయించారు. ఈ సినిమాలో ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ పాత్రను మనోజ్ పోషించాడు.  
*  ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నూతన దర్శకుడు రాము కొప్పుల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో రాహుల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది.   

  • Loading...

More Telugu News