chiranjeevi: చిరూ బర్త్ డే కి 'ఉయ్యాలవాడ' టైటిల్ లోగో రిలీజ్ !


చిరంజీవి అభిమానులంతా కూడా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. సింపుల్ గా ఈ కార్యక్రమం జరిగినందుకు అభిమానులు నిరాశ చెందనవసరం లేదు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమా 'టైటిల్ లోగో'ను ఆవిష్కరిస్తారట.

 అలాగే ఓ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ మోషన్ పోస్టర్ ను ఆ రోజున ఉదయం 11 గంటల 30 నిమిషాలకి విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో .. మోషన్ పోస్టర్ పై 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' లుక్ తో వున్న చిరంజీవిని చూపిస్తారా .. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.   

  • Loading...

More Telugu News