sai dharam tej: 'జవాన్'కి రీ షూట్ చెబుతున్న దిల్ రాజు?


సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బీవీఎస్ రవి దర్శకత్వంలో 'జవాన్' సినిమా తెరకెక్కింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడుగా వ్యవహరించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయాలనుకున్నారు. అదే రోజున 'పైసా వసూల్' రానుండటంతో, అక్టోబర్ 1కి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి.

 అయితే ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో దిల్ రాజు అసంతృప్తిని వ్యక్తం చేసిన కారణంగా విడుదల మరింత ఆలస్యం కానుందనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు అవసరమైన చోట్ల రీ షూట్లు చెప్పే అవకాశం ఉందనీ, అందువలన విడుదల మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. మెగా అభిమానులకి ఈ ఆలస్యం కాస్త నిరాశను కలిగించినా, వెయిట్ చేయక తప్పదు మరి.   

sai dharam tej
mehreen
  • Loading...

More Telugu News