malavika nair: మాళవిక నాయర్ కి మరో ఛాన్స్ దొరికేసింది!


మాళవికా నాయర్ పేరు వినగానే 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా గుర్తుకు వస్తుంది. నాని - విజయ్ దేవరకొండ కథానాయకులుగా నటించిన ఈ సినిమా ద్వారా మాళవికా నాయర్ పరిచయమైంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఈ అమ్మాయి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత చేసిన 'కళ్యాణ వైభోగమే'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో  అమ్మాయి వరుస సినిమాలు చేస్తూ వెళుతుందని అనుకున్నారుగానీ అలా జరగలేదు.

తమిళ .. మలయాళ సినిమాల్లోను ఇంకా నిలదొక్కుకోవడానికే ప్రయత్నిస్తోంది. అలాంటి మాళవిక నాయర్ కి మళ్లీ విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ దొరికింది. గతంలో 'ది ఎండ్' అనే హారర్ థ్రిల్లర్ ను తెరకెక్కించిన రాహుల్ సంకృత్వాన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా మాళవిక కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.        

malavika nair
  • Loading...

More Telugu News