samanta: చైతూను చూసిన క్షణంలోనే ప్రేమలో పడిపోయాను : సమంతా


చిత్రపరిశ్రమలో ఒక్కో సినిమాకి కొన్ని నెలల పాటు కలిసి పనిచేయవలసి వస్తుంటుంది కనుక, యంగ్ హీరోలు .. హీరోయిన్లు లవ్ లో పడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే తాము ప్రేమలో వున్నట్టుగా వాళ్లు అంత తేలికగా ఒప్పుకోరు .. అలాంటిదేం లేదని కొట్టిపారేస్తూ వస్తుంటారు. అయినా వాళ్ల ప్రేమ వ్యవహారం గురించిన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటాయి.

 అయితే ఇలాంటివేం లేకుండానే చైతూతో తన ప్రేమ వ్యవహారం గురించి సమంతా చాలా తేలికగా అందరికీ చెప్పేసింది. తాజాగా ఓ ఇంగ్లిష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, చైతూను చూసిన మరుక్షణమే ఆయన ప్రేమలో పడిపోయానని చెప్పింది. 'ఏ మాయ చేశావే' సినిమాతో మొదలైన తమ ప్రేమ ప్రయాణం .. పెళ్లి వరకూ వచ్చిందని అంది. అక్టోబర్లో అందరి సమక్షంలో తమ పెళ్లి జరుగుతుందనీ .. నిజానికి తన మనసులో తమ పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని చెప్పుకొచ్చింది.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News