jagapathi babu: నిజమే .. అలా చేయడం దెబ్బకొట్టేసింది!: జగపతిబాబు


విలన్ గా ఒక రేంజ్ లో దూసుకుపోతోన్న జగపతిబాబు, 'పటేల్ సార్' తో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పోస్టర్స్ లో జగపతిబాబు కొత్త లుక్ తో కనిపించారు. సాయికొర్రపాటి నిర్మాత కావడంతో అందరిలో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. అయితే విడుదలైన తరువాత ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ప్రేక్షకులను ఈ సినిమా ఎంత మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

 ఆ ప్లాప్ ని జగపతిబాబు అంగీకరించారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అనుకున్నారనీ, తాము ఫ్యామిలీ స్టోరీ చూపించేసరికి నిరాశ చెందారని అన్నారు. బిరియానీ కోసం వచ్చిన వాళ్లకి .. మామూలు భోజనం పెట్టడం వల్లనే పరాజయాన్ని చవి చూడవలసి వచ్చిందని చెప్పారు. మళ్లీ హీరోగా చేయాలా .. వద్దా? అనేది తన దగ్గరికి వచ్చే కథలను బట్టి ఉంటుందని అన్నారు.       

jagapathi babu
  • Loading...

More Telugu News