manchu lakshmi: చిన్నప్పటి సావిత్రి పాత్రలో మంచు లక్ష్మి కూతురు!


మంచు లక్ష్మి అప్పుడే తన కూతురు విద్యా నిర్వాణను తెలుగు తెరకి పరిచయం చేయడానికి ఆసక్తిని చూపుతోంది. విద్యా నిర్వాణ వయసు మూడేళ్ల లోపే .. అయినా ఒక గొప్ప పాత్ర ద్వారా తన కూతురు తెర పరిచయం జరగాలని మంచు లక్ష్మి భావిస్తోంది. అశ్వనీదత్ కుమార్తెలు నిర్మాతలుగా .. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

 ఈ సినిమాలో సావిత్రి చిన్నప్పటి దృశ్యాలు కూడా ఉంటాయట. ఆ పాత్ర ద్వారా తన కూతురు తెర పరిచయం జరిగితే, తనకి అది గ్రేట్ ఫీలింగ్ లా అనిపిస్తుందని మంచు లక్ష్మి భావించిందట. అందువలన ఆ పాత్రను తన కూతురు విద్యా నిర్వాణకి ఇవ్వాల్సిందేనని, నిర్మాతలతో తనకి గల చనువు కారణంగా అడిగిందట. మంచు లక్ష్మి అడిగితే .. అశ్వినీ దత్ కూతుర్లు కాదంటారా? 

manchu lakshmi
vidya
  • Loading...

More Telugu News