rama: 'ఉన్నది ఒకటే జిందగీ' ఫస్టులుక్ వచ్చేసింది!


కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం తెరకెక్కుతోంది. రామ్ అభిమానులకు ఈ టైటిల్ బాగా నచ్చేసింది. యూత్ కి ఈ టైటిల్ బాగానే కనెక్ట్ అయింది. ఈ రోజున ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ పోస్టర్ ను వదిలారు. రామ్ తన ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ లో జీప్ లో వెళుతూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ వుంది.

 జీవితం ఒకటే .. దానిని ఎంజాయ్ చేయాలనేది కథానాయకుడి ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ఒక కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. "ట్రెండు మారినా ఫ్రెండు మారడు .." అంటూ ఈ సాంగ్ కొనసాగుతుందట. ఈ సాంగ్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News