nithin: తన అభిమాన హీరో పవన్ అంటోన్న మేఘా ఆకాశ్!


చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన కథానాయికలు .. తమ అభిమాన నటుడిగా ఎక్కువగా పవన్ కల్యాణ్ పేరు చెబుతుంటారు. తెరపై పవన్ నటన చూసి ఉండటం ఒక కారణమైతే, పవన్ మంచి మనసు గురించి విని ఉండటం మరో కారణం అయ్యుండొచ్చు. అలా మేఘా ఆకాశ్ కూడా పవన్ కల్యాణ్ పేరునే చెప్పింది. ఆయన నటనంటే తనకి ఎంతో ఇష్టమని అంది.

తన తాజా చిత్రంగా 'లై' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించింది. త్రివిక్రంతో కలిసి పవన్ నిర్మిస్తోన్న సినిమాలోను ఆమె నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలోను హీరో నితిన్ కావడం మరో విశేషం. కొత్తగా వచ్చిన వాళ్లలో నివేదా థామస్ .. అనూ ఇమ్మాన్యుయేల్ .. అనుపమ పరమేశ్వరన్ .. కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. మేఘా ఆకాశ్ వాళ్లకి గట్టిపోటీ ఇస్తుందేమో చూడాలి మరి.

nithin
megha
  • Loading...

More Telugu News