Samanta: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం


*  'నేను కోరుకున్న దాని కంటే భగవంతుడు నాకు ఎక్కువే ఇచ్చాడు..' అంటోంది చెన్నై బ్యూటీ సమంత. "ఇంతటి స్థాయికి వస్తానని అసలు అనుకోలేదు. నటిగా నా జర్నీ ఎంతో సంతృప్తిని ఇస్తోంది. కొన్ని సార్లు కష్టాలు ఎదురైనా వాటిని తట్టుకునే శక్తిని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. నేను కోరుకున్న దాని కన్నా, నాకున్న అర్హతల కన్నా భగవంతుడు నాకు ఎక్కువే ఇచ్చాడు' అని చెప్పింది సమంత.        
*  ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్టు హీరో రామ్ తెలిపాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  పలు చిత్రాలలో నటించడమే కాకుండా కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన మంచు లక్ష్మి త్వరలో వెబ్ సీరీస్ లో నటించనుంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ ఆమెకు బాగా నచ్చినట్టు తెలుస్తోంది. వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
*  గతంలో మహేశ్ బాబు నటించిన '1- నేనొక్కడినే' చిత్రాన్ని అప్పట్లోనే తమిళంలోకి డబ్ చేశారు. ఈ రోజు ఈ చిత్రాన్ని తమిళ నాట మళ్లీ పలు థియేటర్లలో రీ- రిలీజ్ చేస్తున్నారు.   

  • Loading...

More Telugu News