allu arjun: ఆగస్టు 15న అల్లు అర్జున్ ఏం చేయబోతున్నాడు?


'దువ్వాడ జగన్నాథమ్'తో దుమ్ము దులిపేసిన అల్లు అర్జున్, వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగును మొదలు పెట్టేశాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు అందుతూ ఉండాలనీ .. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలనే ఆలోచనలో అల్లు అర్జున్ వున్నాడట.

 ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15న ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుందని చెప్పాడు. ఆ గిఫ్ట్ ఏమిటనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది దేశభక్తి నేపథ్యంలో కొనసాగే సినిమా కావడం వలన .. అల్లు అర్జున్ పోషించేది ఆర్మీ ఆఫీసర్ పాత్ర కావడం వలన .. ఫస్టు లుక్ ను వదిలే ఛాన్స్ ఉందనుకోవచ్చు. దీంతో పాటు మరేదైనా ప్లాన్ చేస్తాడేమో చూడాలి మరి.

allu arjun
anu
  • Loading...

More Telugu News