bellamkonda srinivas: బోయపాటి బాగా ఏడిపించేశారంటున్న రకుల్!


బోయపాటి శ్రీను తాజా చిత్రంగా ఈ నెల 11వ తేదీన 'జయ జానకి నాయక' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ, ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి ఈ సినిమాలో చేసిన పాత్ర పూర్తి భిన్నంగా కనిపిస్తుందని చెప్పింది. ఈ సినిమాలో తన పాత్ర చుట్టూ మనసుకి కష్టం కలిగించే సంఘటనలు జరుగుతూ వుంటాయని అంది.

 అందువలన ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకునే సందర్భాలు కనిపిస్తాయని చెప్పింది. ఏడ్చే సన్నివేశాల కోసం తాను గ్లిజరిన్ ఎక్కువగా వాడవలసి వచ్చిందనీ, ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయేవని అంది. కళ్ల క్రింద చారలు వస్తాయేమోనని ఆందోళన కూడా కలిగిందని చెప్పింది. ఈ సినిమాలో ఏడ్చినంతగా తాను ఏ సినిమాలోను ఏడవలేదనీ .. బోయపాటి గారు అంతగా ఏడిపించారని చెప్పుకొచ్చింది.   

bellamkonda srinivas
rakul
  • Loading...

More Telugu News