bellamkonda srinivvas: బోయపాటికి ఇది అగ్ని పరీక్షే!


బోయపాటి శ్రీను దర్శకత్వంలో తమ హీరోలు మాస్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటారు. అంతగా ఆయన హీరోల హీరోయిజానికి బిల్డప్ ఇస్తాడు. యాక్షన్ సీన్స్ లో హీరోయిజాన్ని ఒక రేంజ్ కి తీసుకెళ్తాడు. అలాంటి బోయపాటి శ్రీను తన తాజా చిత్రం 'జయ జానకి నాయక'తో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇదే రోజున మరో రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ పోటీని బోయపాటి మూవీ తట్టుకుని నిలబడవలసి వుంది. బాలకృష్ణ .. బన్నీ లాంటి స్టార్ హీరోలతో బోయపాటి పోటీకి దిగడంలో అర్థం వుంది. కానీ ఇక్కడ వున్నది బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హీరోగా ఇంకా తొలి అడుగులు వేసే దశలోనే వున్నాడు. అలాంటి హీరోతో బోయపాటి రంగంలోకి దిగడం సాహసమేనని చెప్పాలి. ఒక వేళ కథపైనా .. తన టేకింగ్ పైన నమ్మకంతోనే దిగివుంటే, అవి ఎంతవరకూ ఆయనని గట్టెక్కిస్తాయో చూడాలి.     

bellamkonda srinivvas
rakul
  • Loading...

More Telugu News