sridhar seepana: 'బృందావనమది అందరిది' టైటిల్ లోగో విడుదలైంది!


సినీ కథా రచయితలు దర్శకులుగా మారుతుండటం చాలా కాలం నుంచి జరుగుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ .. కొరటాల శివ అలా కథా రచన నుంచి దర్శకత్వం వైపుకు వచ్చిన వారే .. భారీ విజయాలను సొంతం చేసుకున్న వారే. వాళ్ల బాటలో నడవటానికి మరో కథా రచయిత శ్రీధర్ సీపాన రెడీ అవుతున్నాడు.

 కొన్ని సినిమాలకి కథలను .. సంభాషణలను అందించిన ఆయన 'బృందావనమది అందరిది' సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆ సినిమా 'టైటిల్ లోగో'ను ఈ రోజున రిలీజ్ చేశారు. టైటిల్ ను డిజైన్ చేసిన తీరు ఆహ్లాదకరంగా కనిపిస్తూ ..  ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించేలా వుంది. అంతా కొత్త నటీనటులతో .. ఆరోగ్యకరమైన కామెడీతో ఈ సినిమా చేస్తున్నట్టుగా శ్రీధర్ సీపాన చెప్పాడు.   

sridhar seepana
  • Loading...

More Telugu News