dulkar: 'మహానటి' భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ లుక్ ఇదే!


సావిత్రి జీవిత చరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. సావిత్రి .. జెమినీ గణేశన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుందనే సంగతి తెలిసిందే. ఆ తరువాత వాళ్ల వైవాహిక జీవితం గొడవలతోనే కొనసాగింది. అందువలన ఈ సినిమాలో జెమినీ గణేశన్ పాత్రను చూపించవలసిన అవసరం వుంది.

 ఆ పాత్ర కోసం మలయాళ యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన లుక్ ను రివీల్ చేశారు. పాత కాలం నాటి ఆల్బమ్ నుంచి తీసిన ఫోటోగా ఆయన లుక్ ను రివీల్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ పాత్రలను ఎవరు చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.

dulkar
keerthi suresh
  • Loading...

More Telugu News