bellamkonda srinivas: ఆ మూడు సినిమాల మధ్య గట్టిపోటీ తప్పనట్టే!


ఆగస్టు 11వ తేదీన వరుసగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'లై' .. బోయపాటి రూపొందించిన 'జయ జానకి నాయక' .. తేజ తెరకెక్కించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలు ఆ రోజున బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్నాయి. ఆగస్టు 11 తరువాత వరుసగా సెలవులు వస్తుండటంతో ... భారీ వసూళ్ల కోసం ఈ సినిమాలు ఈ తేదీని ఖరారు చేసుకున్నాయి.

ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్లు తగినన్ని దొరకవేమోననే బెంగ కూడా లేదు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా వెనుక సురేశ్ బాబు వున్నారు. నితిన్ 'లై' వెనుక ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి వున్నారు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వెనుక ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ ఉండనే వున్నారు. అందువలన థియేటర్ల కొరత వచ్చే అవకాశమే లేదు. మరి ఈ మూడు సినిమాల్లో ఆడియన్స్ నుంచి అత్యధిక మార్కులు ఏది సొంతం చేసుకుంటుందో చూడాలి.

bellamkonda srinivas
rakul
  • Loading...

More Telugu News