sai dharam tej: 'జవాన్' కోసం నాన్ స్టాప్ గా డాన్స్ చేసిన సాయిధరమ్ తేజ్!


చిరంజీవిని మెగాస్టార్ గా నిలబెట్టిన అంశాలలో ఆయన డాన్స్ ఒకటి. ఆయన తరువాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన చరణ్ .. అల్లు అర్జున్ ఇద్దరూ కూడా, డాన్సుల్లో శభాష్ అనిపించుకున్నారు. ఆ తరువాత ప్లేస్ సాయిధరమ్ తేజ్ దే అనేది అభిమానుల మాట. అందువలన డాన్సుల్లో మరింత కష్టపడటానికి తేజు ప్రయత్నిస్తున్నాడు.

'జవాన్' సినిమాలో ఒక పాట కోసం సాయిధరమ్ తేజ్ ఒక నిమిషం పాటు ఆగకుండా డాన్స్ చేసి అక్కడున్న వాళ్లందరినీ ఆశ్చర్యపరిచాడట. సింగిల్ టేక్ లో ఆయన ఈ డాన్స్ చేయడం విశేషం. తమన్ కంపోజ్ చేసిన ఆ పాటలో ఒక నిమిషం పాటు నాన్ స్టాప్ గా ఆయన వేసిన స్టెప్పులు, ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తాయని అంటున్నారు. బీవీఎస్ రవి దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, మెహ్రీన్ కౌర్ కథానాయిక అనే సంగతి తెలిసిందే.      

sai dharam tej
mehreen
  • Loading...

More Telugu News