maheshbabu: వంశీ మూవీ కోసం వెయిటింగ్ అంటోన్న మహేశ్ బాబు!


మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్' చేసిన మహేశ్ బాబు .. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో 'భరత్ అను నేను' చేస్తున్నాడు. ఇది మహేశ్ కి 24వ సినిమా. ఇక 25వ సినిమాను ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. మహేశ్ కి .. ఆయన అభిమానులకి ఇది ప్రత్యేకమైన సినిమా కావడం వలన, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడు.

 ఈ రోజు వంశీ పైడిపల్లి పుట్టినరోజు కావడంతో .. ట్విట్టర్ ద్వారా మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆయనతో తాను చేయనున్న సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. ఇప్పటికే ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ వంటి యంగ్ హీరోలతో సినిమాలు చేసి మాస్ ఆడియన్స్ చే మార్కులు కొట్టేసిన వంశీ పైడి పల్లి, మహేశ్ తో ఏ తరహా మూవీ చేస్తాడో చూడాలి.

maheshbabu
vamsi paidipalli
  • Loading...

More Telugu News