sunil: 'ఉంగరాల రాంబాబు' ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు?


ఆశించిన ఫలితాలు రాకుండా పోతున్నా కథానాయకుడిగా సునీల్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో 'ఉంగరాల రాంబాబు' విడుదల విషయంలో మాత్రం జాప్యం జరుగుతూ వస్తోంది. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పటికే అన్ని పనులను పూర్తిచేసుకుని విడుదలకు రెడీగా వుంది.

 అయితే సునీల్ గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన, ఈ సినిమా అమ్మకాలు ఆలస్యంగా జరిగాయి. ఆ పని పూర్తి కావడంతో ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రాంతి మాధవ్ సినిమాలపై ఆడియన్స్ కి మంచి నమ్మకం వుంది. గతంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలే అందుకు నిదర్శనం. ఆ నమ్మకాన్ని ఈ సినిమాతోనూ ఆయన నిలబెట్టుకుంటాడేమో చూడాలి మరి.

  • Loading...

More Telugu News