nani: ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నాని న్యూ మూవీ!


'నిన్నుకోరి' హిట్ తో నాని మాంచి ఉత్సాహంతో వున్నాడు. ఈ హుషారుతో ఆయన తన తదుపరి సినిమాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే పనిలో వున్నాడు. ఒక వైపున వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి'ని పూర్తి చేస్తోన్న ఆయన, మరో వైపున మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం'కి సిద్ధమవుతున్నాడు.

 ఈ ప్రాజెక్టుల తరువాత ఆయన కల్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కల్యాణ్ రామ్ 'జై లవ కుశ' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే నానితో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు వుంటుందట. ఇక ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహించనున్నారనేది త్వరలోనే తేలనుంది.  

  • Loading...

More Telugu News