mahesh: మహేశ్ పుట్టిన రోజున ఫ్యాన్స్ కి రెండు కానుకలు


మురుగదాస్ తో మహేశ్ చేసిన 'స్పైడర్' సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ చేస్తోన్న 'భరత్ అను నేను' ప్రస్తుతం సెట్స్ పై వుంది. ఈ రెండు సినిమాలపై మహేశ్ అభిమానులు దృష్టిపెట్టారు.

వచ్చేనెల 9న మహేశ్ పుట్టిన రోజు కావడంతో, ఈ సినిమాల నుంచి రానున్న గిఫ్ట్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఆశిస్తున్నట్టుగానే 'స్పైడర్' సినిమా నుంచి టీజర్ ను .. 'భరత్ అను నేను' సినిమా నుంచి ఫస్టు లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయట. ఇక ఈ రెండూ కూడా ఈ సినిమాలపై ఏ స్థాయిలో అంచనాలను పెంచుతాయో చూడాలి.      

  • Loading...

More Telugu News