rakul: విజయ్ సరసన రకుల్ ఛాన్స్ కొట్టేసినట్టే!


రకుల్ జోరు మామూలుగా లేదు .. ఆమె సక్సెస్ గ్రాఫ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తెలుగులో అగ్రహీరోలతో వరుస సినిమాలు చేసేస్తోన్న రకుల్, తమిళంలోను ఆ స్థాయి దూకుడు చూపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే తెలుగులో ఆమె పవన్ కల్యాణ్ సరసన ఛాన్స్ కొట్టేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

 ఇక తాజాగా తమిళంలో విజయ్ సరసన కథానాయికగా అవకాశం వచ్చిందనే టాక్ కూడా వినిపిస్తోంది. మురుగదాస్ ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో రకుల్ 'స్పైడర్' చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటన నచ్చడం వల్లనే ఆమెకి విజయ్ సినిమాలో మురుగదాస్ ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి రకుల్ అదృష్టవంతురాలే అనిపించుకుంటోంది. 

  • Loading...

More Telugu News