vishal: విశాల్ లేటెస్ట్ టీజర్ అదరగొట్టేస్తోంది!


మొదటి నుంచి కూడా విశాల్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆ కారణంగానే ఆయనకి మాస్ ఇమేజ్ ఎక్కువ. ఈ సారి కూడా ఆయన వాళ్లను దృష్టిలో పెట్టుకునే 'తుప్పరివాలన్' సినిమా చేశాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. దాంతో తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

 ఛేజింగ్ .. ఫైట్స్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో వున్నాయనే విషయం ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్ తో అంచనాలు తప్పకుండా పెరుగుతాయనే చెప్పొచ్చు. స్నేహ భర్త 'ప్రసన్న' విలన్ గా నటించిన ఈ సినిమాలో, ఆండ్రియా .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు.

 

  • Loading...

More Telugu News