Anushka: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం


*  మహేశ్ బాబు నటిస్తున్న సినిమాలో అందాలతార అనుష్క స్పెషల్ సాంగు చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న 'భరత్ అను నేను' అనే సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని అనుష్క చేస్తుందట. ఇందుకు ఈ చిన్నది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అనుష్క 'భాగమతి' సినిమాలో నటిస్తోంది.
*  యాక్షన్ హీరో గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో రూపొందిన 'గౌతమ్ నంద' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఆడియో సీడీలను కథానాయిక కేథరిన్ విడుదల చేయగా, తొలిసీడీని హీరో గోపీచంద్ స్వీకరించాడు. ఈ నెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
*  మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ త్వరలో మలేసియాలో జరుగుతుంది. 25 రోజుల పాటు ఈ షూటింగ్ అక్కడ జరుగుతుంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
*  నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'లై' చిత్రం శాటిలైట్ హక్కుల కోసం ఓ టీవీ చానెల్ 7 కోట్లు ఆఫర్ చేసిందట.నితిన్ కెరీర్లో శాటిలైట్ హక్కుల పరంగా ఇది అత్యధిక రేటుగా చెప్పుకోవచ్చు.   

  • Loading...

More Telugu News