sudheer babu: తల్లి ప్రేమతో సక్సెస్ సాధ్యమైందన్న సుధీర్ బాబు!


సుధీర్ బాబు మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. వరుస సినిమాలు చేయాలని కాకుండా .. తనకి బాగా నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. అలా కొంత గ్యాప్ తరువాత ఆయన చేసిన సినిమానే 'శమంతకమణి'. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో నలుగురు హీరోల్లో ఒకరిగా ఆయన చేశాడు.

శ్రీమంతుడి కుమారుడైన కృష్ణ పాత్రలో ఆయన నటించాడు. తల్లిలేని కొడుకుగా ఆయన ఈ పాత్రలో భావోద్వేగాలను అద్భుతంగా పండించాడు. దాంతో ఇటు సాధారణ ప్రేక్షకుల నుంచి .. అటు ఇండస్ట్రీకి చెందిన వారి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా సుధీర్ బాబు స్పందిస్తూ .. తల్లిలేని కొడుకుగా నటించవలసి వచ్చినప్పుడు తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని చెప్పాడు. ఈ రోజున తెరపై తాను పడుతోన్న కష్టమంతా తన తల్లిదేనని అన్నాడు. ఆమె ప్రేమతోనే తాను ఈ విజయాన్ని అందుకున్నానని చెప్పుకొచ్చాడు.    

sudheer babu
  • Loading...

More Telugu News