nara rohith: 'శమంతకమణి' డైరెక్టర్ బిజీ కానున్నాడా?


నారా రోహిత్ .. సుధీర్ బాబు .. సందీప్ కిషన్ .. ఆది సాయికుమార్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన 'శమంతకమణి' .. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నలుగురు యువకథానాయకులు కలిసి నటించడం .. అందుకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ .. టీజర్ .. ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

 దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నలుగురు హీరోల పాత్రలను మలిచిన తీరు సూపర్బ్ అంటున్నారు. నలుగురికి నాలుగు విభిన్నమైన పాత్రలనిచ్చి .. ఆ పాత్రలకి సమానమైన ప్రాధాన్యతనిచ్చి కథా కథనాలను ఆసక్తిగా నడిపించిన తీరును ప్రశంసిస్తున్నారు. 'భలే మంచి రోజు' తరువాత 'శమంతకమణి'తో శ్రీరామ్ ఆదిత్య ఆడియన్స్ ను మెప్పించడంతో, తదుపరి సినిమాల కోసం కొంతమంది నిర్మాతలు ఆయనను సంప్రదిస్తున్నారట. ఈ సక్సెస్ తో ఆయన బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.      

nara rohith
sudheer varma
  • Loading...

More Telugu News