jagapathibabu: అల్లు అర్జున్ అంటే ఇష్టమంటోన్న జగపతిబాబు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-tnews-08e2b0298a0099da529ecd43b4e9212ae3fae755.jpg)
నటన పరంగాను .. వ్యక్తిత్వం పరంగాను జగపతిబాబు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తారు. మనసులోని మాటను స్పష్టంగా .. సూటిగా చెప్పడం ఆయనకి అలవాటు. తెలుగు తెరపై వెలుగొందుతోన్న యువ కథానాయకులలో ఎవరంటే ఇష్టమనే ప్రశ్న .. ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబుకి ఎదురైంది. దాంతో ఆయన అల్లు అర్జున్ పేరు చెప్పేశారు.
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా .. తన టాలెంట్ తో ఆయన ఎదుగుతూ వచ్చాడని అన్నారు. అల్లు అర్జున్ నటన .. డాన్స్ .. కష్టపడే తత్వం తనకి చాలా ఇష్టమని చెప్పారు. ఇక తన కెరియర్ గురించి ప్రస్తావిస్తూ సంతృప్తిని వ్యక్తం చేశారు. లేటు వయసులో విభిన్నమైన పాత్రలను చేయడంలో అమితాబ్ తో తనకి పోలిక ఉందని అన్నారు. వాయిస్ విషయంలోను .. కెరియర్ గ్రోత్ విషయంలోను ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు.