త్రిష '96' మూవీ షూటింగ్ 30 లొకేషన్లలో!
మొదటి షెడ్యూల్ షూటింగ్ రాజస్థాన్ .. కలకత్తా .. కులుమనాలి .. అండమాన్ లలో జరిపారు. రెండవ షెడ్యూల్ షూటింగ్ ను 'కుంభకోణం'లో జరపడానికి రెడీ అవుతున్నారు. ట్రావెలింగ్ నేపథ్యంలో కొనసాగే కథ ఇది. అందువలన ఇన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేయవలసి వస్తుందని అంటున్నారు. ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు . నందగోపాల్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.