pavan kalyan: సంక్రాంతికి పవన్ కల్యాణ్ కి ఎవరూ పోటీ లేనట్టే!


సంక్రాంతి వస్తుందంటే చాలు .. థియేటర్ల దగ్గర కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా సీనియర్ హీరోల సినిమాలు బరిలోకి దిగుతుంటాయి. ఈ పోటీని ఇష్టంగా తట్టుకుని నిలబడటానికి హీరోలు రెడీ అవుతుంటారు. ఈ సారి  సంక్రాంతికి మాత్రం, త్రివిక్రంతో పవన్ చేస్తోన్న సినిమా మాత్రమే థియేటర్స్ కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

 చిరంజీవి 'ఉయ్యాలవాడ' సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఇక వెంకటేశ్ .. నాగార్జున చేతుల్లో సంక్రాంతికి వచ్చే సినిమాలు లేవు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ  చేసే సినిమా సంక్రాంతికి రావొచ్చనే టాక్ వుంది. కానీ అది ఇంతవరకూ మొదలుకాకపోవడం వలన, సంక్రాంతి బరిలో ఉంటుందా? అనేది డౌటే. ఇక సుకుమార్ దర్శకత్వంలో చరణ్ చేస్తోన్న 'రంగస్థలం 1985' సంక్రాంతికి సిద్ధమైనా, పవన్ సినిమాకి పోటీగా రాకపోవచ్చని అంటున్నారు. అందువలన వచ్చే సంక్రాంతి సందడంతా పవన్ కల్యాణ్ దేనని చెప్పుకుంటున్నారు.         

pavan kalyan
  • Loading...

More Telugu News