mahesh babu: అలా చేస్తే మహేశ్ కి కోపం వస్తుందన్న సమంత!


సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా వుంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులతో మాట్లాడింది. తనకి సంబంధించిన విషయాలతో పాటు .. ఇతర నటీనటుల గురించిన ప్రస్తావన కూడా తెచ్చింది. మహేశ్ బాబుతో సమంత మూడు సినిమాల్లో నటించింది. వాటిలో రెండు సినిమాలు హిట్ కొట్టగా .. మూడవ సినిమా ఫ్లాప్ అయింది.

 ఈ నేపథ్యంలో సెట్లో మహేశ్ బాబు ఎలా ఉంటాడు? అనే అభిమాని ప్రశ్నకి సమంత ఆసక్తికరమైన సమాధానమిచ్చింది. సెట్లో మహేశ్ బాబు చాలా సరదాగా ఉంటాడనీ .. సందడి చేస్తాడని చెప్పింది. షూటింగ్ బ్రేక్ సమయంలో సరదాగా కబుర్లు చెప్పే మహేశ్ బాబు .. కెమెరా ముందుకు వెళ్లగానే ఇట్టే మారిపోతాడని అంది. ఆయన దృష్టంతా చేయబోయే సీన్ పైన .. నటనపైనే ఉంటుందని చెప్పింది. ఆ సమయంలో స్పాట్లో ఎవరూ మాట్లాడుకోవడం .. నవ్వుకోవడం చేయకూడదని, అలా చేస్తే మహేశ్ కి కోపం వస్తుందని చెప్పుకొచ్చింది.    

mahesh babu
samanta
  • Loading...

More Telugu News