niveda thomas: తన అభిమాన నటులను మార్చేస్తున్న హీరోయిన్!


కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన కథానాయికలు .. ఎవరూ అడగకపోయినా ఫలానా హీరోలంటే తమకి ఇష్టమని చెబుతుంటారు. ఆ హీరోలతో కలిసి నటించాలని ఉందని అంటారు. ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే తమంతటి అదృష్టవంతులు లేరనేస్తారు. ప్రస్తుతం నివేదా థామస్ అదే పరిస్థితిలో వుంది.

గతంలో 'దృశ్యం' రీమేక్ గా కమల్ తో 'పాపనాశం' చేస్తున్నప్పుడు ఆయన తన ఫేవరెట్ హీరో అని చెప్పింది. నానితో 'జెంటిల్మెన్' చేస్తున్నప్పుడు ఆయనే తన అభిమాన నటుడని అంది. ఆయన సినిమాలను వదలకుండా చూసేస్తానని చెప్పింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' చేస్తోంది. ఇప్పుడేమో తన ఫేవరెట్ హీరోగా ఆయన పేరు చెబుతోంది. మామూలుగా సినిమా .. సినిమాకి పారితోషికాలు మారిపోతాయి గానీ .. ఇలా ఫేవరెట్ హీరోలు మారిపోతారా అని!     

niveda thomas
  • Loading...

More Telugu News